నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దింతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ నిలిచిపోయింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 62/2తో నిలవగా, ఛెతేశ్వర్ పుజారా 8 పరుగులు,కెప్టెన్ అజింక్య రహానె 2 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు.నటరాజన్‌కు జతగా శార్దూల్, వాషింగ్టన్ సుందర్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్ దక్కింది.అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ శుభ్‌మన్ కమిన్స్ బౌలింగ్‌లో స్మిత్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై రోహిత్ 44 పరుగులు చేసి పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. అయితే జోరు మీదున్న రోహిత్ ను నాథన్ లైయన్ ఔట్ చేసాడు. దీంతో టీమిండియా 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆపై రహానె క్రీజులోకి రాగా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఆపై ఎడతెరిపి లేని వర్షం కురవడంతో రెండో రోజు ఆటను రద్దుచేశారు.