బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా బరాక్,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (44; 74 బంతుల్లో 6×4) మరోసారి నిరాశపరిచాడు.ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతికి గాల్లోకి షాట్ ఆడిన అతడు మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని రోహిత్ మూడో టెస్టు నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో మొత్తంగా 78 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి లైయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ప్రపంచ క్రికెట్ లోని అన్ని జట్ల బౌలర్లపై రోహిత్ శర్మ ఆధిపత్యం చెలాయిస్తుండగా.. అతన్ని అలవోకగా ఔట్ చేసేస్తూ నాథన్ లైయన్ తాజాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.రోహిత్ శర్మ కెరీర్లో ఇప్పటి వరకూ 33 టెస్టు మ్యాచ్‌లాడగా.. అతణ్ని ఏకంగా 6 సార్లు లైయన్ ఔట్ చేసేశాడు. మరే బౌలర్ కూడా ఈ తరహాలో రోహిత్ శర్మపై ఆధిపత్యం చెలాయించలేదు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడతో సమానంగా లైయన్ ఐదుసార్లు రోహిత్ ను ఔట్ చేయగా..తాజాగా ఔట్ చేయడంతో టీమిండియా ఓపెనర్ ను టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా ఈ లైయన్ రికార్డు సాధించాడు.