బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్‌లో భారత జట్టు కష్టాల్లో పడింది. 62 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాను ఆసీస్ బౌలర్లు కొలుకోలేని దెబ్బతీశారు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా (24)ను హెజిల్వుడ్ ఔట్ చేశాడు. ఆ తరువాత యువ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌తో జతకట్టిన కెప్టెన్ అజింక్యా రహానే జట్టును ముందుండి నడిపించాడు. 100 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన సమయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తుండగా.. 144 పరుగుల వద్ద రహానే (37) పెవిలియన్ చేరాడు. ఆపై మయాంక్ అగర్వాల్ (38) సైతం ఔటయ్యాడు. దీంతో 161 పరుగులకు టీమిండియా ఐదు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తరువాత రిషబ్ పంత్ (23) కూడా వెనుదిరిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రిజ్‌లోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (67),వాషింగ్టన్ సుందర్ (62) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలోనే రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెద్దస్కోర్లు సాధించిక పోయినా వీరిద్దరూ అర్ధశతకాలతో రాణించారు. అయితే జట్టు స్కోరు 309 వద్ద శార్దూల్.. కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో వీరిద్దరూ గబ్బా మైదానంలో భారత జట్టు తరఫున ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు….Attachments area