Home క్రీడలు 5 వికెట్లతో దుమ్మురేపిన సిరాజ్..భారత్ లక్ష్యం 328

5 వికెట్లతో దుమ్మురేపిన సిరాజ్..భారత్ లక్ష్యం 328

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని భారత జట్టు ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ సిరాజ్ 5 వికెట్లతో దుమ్మురేపగా..శార్దూల్ ఠాకూర్‌ 4 వికెట్లతో అదరగొట్టాడు.వాషింగ్టన్ సుంద‌ర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్‌ స్మిత్ 55 పరుగులు, డేవిడ్ వార్నర్‌ 48 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలిచారు..


అంతకుముందు, 21/0తో నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే  శార్దూల్ ఠాకూర్ షాక్ ఇచ్చాడు. చక్కటి బంతితో హ్యారిస్(38)ని ఔట్ చేసాడు. ఆ తరువాతి ఓవర్లోనే వార్నర్‌(48)ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత లబుషేన్(25), స్టీవ్ స్మిత్(55)స్కోరు బోర్డును నడింపించారు. ఈ క్రమంలోనే లబుషేన్‌ను మహ్మద్ సిరాజ్  పెవిలియన్ చేర్చాడు.అలాగే అదే ఓవర్లో మాథ్యూవేడ్(0)ను ఔట్ చేసాడు.అయితే  స్మిత్‌కు గ్రీన్(37) అండగా నిలిచాడు.  ఈ క్రమంలోనే స్మిత్‌ను కూడా సిరాజ్ అద్భుతమైన బంతితో పెవిలియన్ చేర్చాడు. ఆపై గ్రీన్‌,టీమ్ పైన్ ను కూడా శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. దీంతో 294 పరుగులకు ఆసీస్ ఆలౌటైంది..

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు