Home క్రీడలు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు జట్టును ప్రకటించిన భారత్

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు జట్టును ప్రకటించిన భారత్

ఫిబ్రవరిలో భారత్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.. ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. హార్దిక్ పాండ్యా 2018 తర్వాత మొదటిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పుకున్న ఇషాంత్ దేశీయ టీ-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. నాలుగు మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్ధిమాన్‌ సహా ఇద్దరూ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

ఇక బ్రిస్బేన్‌ టెస్టులో సత్తా చాటిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్,బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్‌కు చోటు దక్కింది. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ సైతం తమ స్థానాలను నిలుపుకున్నారు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన హనుమ విహారి, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీని ఇంగ్లండ్‌తో జరగనున్న రెండు టెస్ట్‌లకు బీసీసీఐ పక్కన పెట్టింది.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్‌ సిరాజ్, శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా, శార్దూల్‌ ఠాకూర్, మయాంక్‌ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్, చతేశ్వర్‌ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు