Home క్రీడలు గబ్బాలో గర్జించిన భారత్

గబ్బాలో గర్జించిన భారత్

గబ్బాలో గర్జించిన భారత్..ఆసీస్‌పై అద్భుత విజయం


భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్‌ పంత్‌ దూసుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్‌ తోడవడంతో ఆసీస్‌ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను గడగడలాడించింది.

4/0 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రోహిత్‌ శర్మ  ఔట్‌ ద్వారా భారీ షాక్ తగిలింది. ఆ తరవాత క్రిజ్‌లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు.. గిల్‌ 91 పరుగుల వద్ద ఔట్‌ అయినా. పుజారా బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ రహానే 24 పరుగులతో వెంటనే పెవిలియన్‌ బాట పట్టినా.. యువ సంచలనం రిషభ్‌ పంత్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు.. పంత్‌ 134 బంతుల్లో 89 పరుగులు చేసి మెరుపు ఇన్సింగ్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు..

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు