భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి చెందిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానె ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ 138 బంతుల్లో 89 పరుగులు చేసి అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టాడు..కాగా, కమిన్స్ వేసిన 58.3వ ఓవర్‌కు రెండు పరుగులు తీసి టెస్టు క్రికెట్ లో 1000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. అయితే పంత్ 27వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధిస్తే.. ధోనీ 32 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు..
ఇదిలావుండగా..భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయాసంగా భారత్ ఛేదించింది. రిషభ్ పంత్ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాపై విజయ దుందుభి మోగించింది. దింతో.. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా ఓటమి దెబ్బ రుచి చూపించింది..Attachments area