ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రక విజయం సాధించింది. గత 32 ఏళ్లగా గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాను మట్టికరిపించి టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే పోటాపోటీగా సాగిన ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోతుంది..కాగా..నాలుగో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ మరో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అజేయమైన హాఫ్ సెంచరీతో ఆసీస్‌కు సొంతగడ్డపైనే చుక్కలు చూపించాడు. 137 బంతుల్లో 9 బౌండరీలు, ఓ సిక్సర్‌తో పంత్ అజేయంగా 89 పరుగులు చేశాడు…
కాగా..నాలుగో టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన పంత్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు..’నా కల నిజమైంది. నేను ఫామ్‌లో లేని సమయంలో జట్టు నాకు అండగా నిలిచింది. తొలి టెస్ట్ తర్వాత నెట్స్‌లో చెమటోడుస్తున్నాం. జట్టు యాజమాన్యం ఎప్పుడూ నాకు మద్దతుగా ఉంది. నేనో మ్యాచ్ విన్నర్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని పంత్ పేర్కొన్నాడు..కాగా, పంత్ భారత జట్టు తరపున ఇప్పటివరకు 16 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.Attachments area