టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హర్బజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు.”చెన్నైతో నా ప్రయాణం ముగిసిపోయే సమయం వచ్చింది. ఈ జట్టుకు ఆడటం గొప్ప అనుభవం. మరుపురాని జ్ఞాపకాలు, గొప్ప స్నేహితులు ఈ జట్టులో ఉన్నారు. చెన్నై జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు అని హర్భజన్ ట్వీట్ చేశాడు. కాగా..హర్భజన్ గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే…
ఇదిలావుండగా..హర్భజన్ సింగ్ ఐపీఎల్లో 2018 నుంచి 2020 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.. 2018లో జరిగిన వేలంలో చెన్నై జట్టు హర్భజన్నబీరూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.ఇక భజ్జి తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 160 మ్యాచ్‌లాడి 150 వికెట్లు తీశాడు. అయితే 2018 సీజన్లో చెన్నై తరపున 13 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. కాగా, 2019 సీజన్ లో మాత్రం 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి రాణించాడు.Attachments area