Home క్రీడలు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపిన పంత్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపిన పంత్

ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మంగళవారం ముగిసిన చివరి టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 89 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆటలో చివరి రోజు.. అదీ పిచ్ నుంచి టర్న్ లభిస్తున్న సమయంలో స్పిన్నర్ నాథన్ లయన్‌ని అతను ఎదుర్కొన్న తీరుపై మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. 328 పరుగుల లక్ష్య ఛేదనలో యువ ఓపెనర్ శుభమన్ గిల్ 91 పరుగులు చేసి విజయానికి బాటలు వేసినా.. ఆ తర్వాత పుజారా 56 పరుగులు, రహానె 24 పరుగులు, మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేసి ఔటవడంతో.. టీమిండియా డ్రా కోసం ప్రయత్నిస్తుందని అంతా ఊహించారు. కానీ.. రిషబ్ పంత్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ.. టీ20 తరహా ఇన్నింగ్స్‌తో మరో 19 బంతుల ఆట మిగిలి ఉండగానే టీమిండియాకి 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు
ఈ క్రమంలోనే రిషబ్ పంత్ … తన కెరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు. వికెట్ కీపర్లలో  తొలి స్థానం అతనిదే కావడం విశేషం.పంత్ తర్వాత దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ నిలిచాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 15 స్థానం దక్కించుకున్న డికాక్.. వికెట్ కీపర్‌గా రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, టీమిండియా ఆటగాళ్లలో శుభమన్ గిల్ 68వ స్థానం నుంచి 47వ స్థానానికి, పుజార 17వ స్థానానికి, సిరాజ్ 45వ స్థానానికి ఎగబాకారు.అలాగే  మూడో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ 4వ స్థానానికి పడిపోయాడు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు