Home క్రీడలు నేను తీసిన ప్రతి వికెట్‌ నాన్నకు అంకితం: సిరాజ్

నేను తీసిన ప్రతి వికెట్‌ నాన్నకు అంకితం: సిరాజ్

టీమిండియా యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం నగరానికి చేరుకున్న సిరాజ్… తన తండ్రి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.ఈ నేపథ్యంలో ఆసీస్‌ విజయం వెలకట్టలేనిదంటూ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియాలో సాధించిన ప్రతి వికెట్‌ను తన తండ్రికి అంకితమిచ్చినట్టు సిరాజ్‌ తెలిపాడు. తాను తీసిన 13 వికెట్లలో మార్నస్‌ లబుషేన్‌ వికెట్ ‌ఎంతో ప్రత్యేకమన్నాడు. ఐదు వికెట్ల ఘనత అందుకోవడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. నాలుగో టెస్టులో ప్రధాన పేసర్‌గా భావించలేదని జట్టు అవసరాల మేరకు ఆడాలనుకున్నానని వెల్లడించాడు.కాగా టెస్టు సిరీస్‌లో సిరాజ్‌ మొత్తంగా 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. ముఖ్యంగా గబ్బాలో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.

అత్యంత ప్రముఖమైనవి

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో.. బ్లాక్ బస్టర్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన తరవాత ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ...

థియేటర్‌లో ‘హాకీ’ ఆడేందుకు దూసుకొస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌...

ఇటీవలి వ్యాఖ్యలు