ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాట్స్ మెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.భారత్ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఏబీని రిటైన్ చేసుకుంటున్నట్లు బెంగళూరు యాజమాన్యం ప్రకటించింది. దాంతో.. ఈ ఏడాది ఐపీఎల్లో ఆడటం ద్వారా రూ.11 కోట్లని సంపాదించనున్న డివిలియర్స్.. ఐపీఎల్లో మొత్తంగా రూ.100 కోట్లు ఆర్జించిన క్రికెటర్ల జాబితాలో చేరనున్నాడు. ఇప్పటి వరకూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే ఐపీఎల్ ద్వారా రూ.100 కోట్లు సంపాదించారు.
ఈ మెగా టోర్నీలో మొత్తంగా.. రూ.102 కోట్లని ఏబీ డివిలియర్స్ ఈ ఏడాదికి ఆర్జించబోతున్నాడు. కాగా.. ఈ ఘనత సాధించబోతున్న తొలి విదేశీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కావడం విశేషం..ఇదిలాఉండగా.. యూఏఈ వేసికగా ముగిసిన ఐపీఎల్13 సీజన్లో 454 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. 15 మ్యాచ్‌లో మూడు అర్ధ సెంచరీలు చేసిన ఏబీ 158.7 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఘనత సాధించాడు.