స్వదేశంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 సీజన్ కోసం వచ్చే నెలలో మినీ ఐపీఎల్ వేలాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ వేలం నేపథ్యంలో టోర్నీలోని 8 ఫ్రాంచైజీలు ఇప్పటికే అట్టిపెట్టుకున్న ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి.కాగా, ఐపీఎల్-2021 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం ఫిబ్రవరి 11న జరుగుతుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు వేలం నిర్వహణ ఒక వారం పాటు వాయిదా పడిందని సమాచారం.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కొద్దిరోజుల్లో తాజా వేలం తేదీని ప్రకటించనుంది.కాగా,ఐపీఎల్ వేలం ఫిబ్రవరి మూడో వారంలో జరుగుతుంది. తుది తేదీతో పాటు వేదికను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా,ఐపీఎల్ 2021 వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇస్తున్నాయి. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్ వదిలేసింది..దీంతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు హర్బజన్ సింగ్, మురళీ విజయ్, పియూష్ చావ్లాలతో పాటు కేదార్ జాదవ్‌ను సీఎస్కే వదులుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పలువురు ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌తో పాటు అలెక్స్ హేల్స్, భారత ఆటగాళ్లు సందీప్, మోహిత్ శర్మలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.Attachments area