భారత క్రికెట్ జట్టు యువ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తన సహచర ఆటగాడు రిషబ్ పంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికి తన కెరీర్‌కు వచ్చిన ప్రమాదం ఏం లేదని తెలిపాడు.ఈ క్రమంలోన్ సాహా మాట్లాడుతూ..”పంత్‌కు,నాకు మధ్య మంచి అనుబంధం ఉంది.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా.. ఎవరు బాధపడం.. పైగా ఒకరినొకరు సాయం చేసుకుంటాం. మా ఇద్దరి బ్యాటింగ్‌లో ఎవరిశైలి వారిది. మ్యాచ్‌లో నిలకడగా రాణించినవారికి జట్టు యాజమాన్యం అవకాశాలిస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళుతా.. అంతేగాని జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో ఉండదు. బ్యాటింగ్‌లో చక్కటి ప్రదర్శన చేసిన పంత్ కీపింగ్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు.
అలాగే,ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విఫలమైన తర్వాత మిగతా మూడు టెస్టులల్లో అవకాశం దక్కకపోవడంపై సాహా స్పందించాడు. ఎవరి కెరీర్‌లోనైనా ఓటములు ఉంటాయి. కెరీర్లో ముందుకు సాగాలంటే ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొవడం తప్పనిసరి.. నేను గాయపడడంతోనే కదా.. రిషబ్ పంత్ ప్రతిభ ఎంత అనేది భయపడింది. అంతమాత్రానా నా కెరీర్ ముగిసిపోతుందని నేను అనుకోనని సాహా పేర్కొన్నాడు.ఇక కెప్టెన్సీ విషయానికొస్తే రహానె ప్రశాంతంగా ఉంటాడని, కోహ్లీ లాగే ఆటగాళ్లపై పూర్తి నమ్మకం కలిగి ఉంటాడని సాహా తెలిపాడు. కాకపోతే కోహ్లీలా భావోద్వేగాలను బయటపెట్టడని చెప్పాడు. ప్రశాంతంగా ఉంటూనే తన పని తాను చేసుకుపోతాడని తెలిపాడు. ఆటగాళ్లలో ఎలా స్ఫూర్తి నింపాలో రహానెకు బాగా తెలుసన్నాడు. అదే అతడి సక్సెస్ మంత్రం అని సాహా చెప్పుకొచ్చాడు.