ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, మోనూ సింగ్, పీయూస్ చావ్లాని వేలంలోకి వదిలేసిన చెన్నై ఫ్రాంఛైజీ.. రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్నీ రిలీజ్ చేసింది. మొత్తంగా 18 మంది ఆటగాళ్లని మాత్రమే అట్టిపెట్టుకున్న చెన్నై.. ఫిబ్రవరిలో జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ని దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా,మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2019లో జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కొన్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్లో 2020లో 13 మ్యాచ్‌లాడిన అతను 105 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం మాక్స్‌వెల్‌ని రూ.10.75 కోట్లకి కొనుగోలు చేసిన పంజాబ్ ఈసారి వేలంలోకి వదిలేసింది. వాస్తవానికి బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా క్రీజులోకి వెళ్లి భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం మాక్స్వెల్ సొంతం. ఈ నేపథ్యంలో అతడ్ని వేలంలో కొనుగోలు చేయాలని చెన్నై ఫ్రాంఛైజీ ఆలోచితున్నట్లు సమాచారం.Attachments area