Home క్రీడలు మమ్మల్ని స‌ర్క‌స్‌లో జంతువుల్లాగా చూశారు: అశ్విన్

మమ్మల్ని స‌ర్క‌స్‌లో జంతువుల్లాగా చూశారు: అశ్విన్

ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. ఈ పర్యటనలో తాను ఆడిన తొలి మూడు టెస్టులకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్, జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌తో కలిసి పంచుకున్నాడు.ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ..ఆస్ట్రేలియాలో భారత జట్టును స‌ర్క‌స్‌లో జంతువుల‌లాగా చూశార‌ని, జట్టును మాన‌సికంగా దెబ్బ కొట్ట‌డానికి అక్క‌డి క్రికెట్ అభిమానులు, మీడియా ప్ర‌య‌త్నించార‌ని అశ్విన్ వెల్ల‌డించాడు.
ఇక మూడో టెస్టులో బ్యాటింగ్ చేయడానికి ముందు రోజు రాత్రంతా వెన్ను నొప్పితో బాధపడిన అశ్విన్‌ సరిగా కూర్చోలేకపోయాడు. షూ లేస్‌ కట్టడం కూడా కష్టంగా మారింది. ఇక బ్యాటింగ్‌కు వెళ్లే ముందు, టీ విరామ సమయంలో కూడా అతను పూర్తిగా నిలబడే ఉన్నాడు. కానీ ఏం జరిగినా ఓటమిని అంగీకరించని అశ్విన్‌ తత్వం భారత్‌ను ఓటమి భారం నుంచి తప్పించింది. ఎలాగైనా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాలని సంకల్పంతో బరిలోకి దిగిన అతను తన పట్టుదలను చూపించాడు.ఆసీస్ పేసర్లు విరుచుకుపడుతున్నా అతను వెన్ను చూపలేదు. చివరి సెషన్‌లో ఆసీస్‌ బౌలర్లు తొలి బంతి నుంచే బౌన్సర్లతో అశ్విన్‌పై విరుచుకుపడ్డారు. కమిన్స్‌ బంతి పక్కటెముకలకు తగిలిన సమయంలోనైతే అతను విలవిల్లాడిపోయాడు. ఫిజియో చికిత్స చేయాల్సి వచ్చింది. ఆపై పదే పదే తన చెస్ట్‌ గార్డ్‌ను సరి చేసుకుంటూ అతను జాగ్రత్త పడ్డాడు. ఏ బంతి ఆడినా ఫీల్డర్‌ చేతుల్లో పడుతుందేమో అన్నంత తీవ్ర ఒత్తిడిలో ఆడిన అశ్విన్‌ చివరకు తన బ్యాటింగ్‌ సత్తా ప్రదర్శించాడు. ఆసీస్‌ బౌలర్లకు మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకుండా కొన్ని చక్కటి షాట్లు ఆడి జట్టును గట్టెక్కించాడు…Attachments area

అత్యంత ప్రముఖమైనవి

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు. ...

మహిళల అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ – మార్చ్ 7 నుంచి

భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ తో ఆరంభమవుతోంది.  బి సీ సీ ఐ వన్ డే మరియు టి 20ల మహిళా జట్లను...

ఇటీవలి వ్యాఖ్యలు