Home క్రీడలు భారత్, ఇంగ్లండ్ సిరీస్‌: అభిమానుల‌కు అనుమ‌తి!

భారత్, ఇంగ్లండ్ సిరీస్‌: అభిమానుల‌కు అనుమ‌తి!

భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ). చాలా రోజులుగా క్రికెట్ మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని ఉవ్విళ్లూరుతున్న అభిమానుల ఆశ‌లు త్వ‌ర‌లోనే నెర‌వేరే అవ‌కాశాలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరగనున్న మ్యాచ్‌లకు ఎలాగైనా ప్రేక్షకులను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీ20 మ్యాచ్‌లకు అభిమానులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఫ్యాన్స్ లేకుండానే నిర్వహించనున్నట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే మిగిలిన రెండు టెస్టులను ఎక్కడ నిర్వహించేదీ ఇంకా తెలియరాలేదు. అయితే టెస్టుల తరువాత నిర్వహించే ఐదు టీ20 మ్యాచ్‌లు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న మోతేరా స్టేడియంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లలో అభిమానులను కూడా అనుమతించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు