Home క్రీడలు ఐసీసీ కీలక ప్రకటన: ఇకపై ప్రతినెలా బెస్ట్ ప్లేయర్‌ అవార్డు

ఐసీసీ కీలక ప్రకటన: ఇకపై ప్రతినెలా బెస్ట్ ప్లేయర్‌ అవార్డు

టెస్టు క్రికెట్ లో ఇక నుంచి ప్రతినెలా ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులను ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఏడాది పొడవునా పురుషులు, మహిళా క్రికెటర్లకు ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ మాజీ ఆటగాళ్ళు, ప్రసారకులు, జర్నలిస్టులతో కూడిన స్వతంత్ర ఓటింగ్ అకాడమీ అభిమానులతో కలిసి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం ఓటు వేసి విజేతల్ని నిర్ణయిస్తారు…

కాగా ఈ సరికొత్త అవార్డు కేటగిరీలో జనవరి నెలకుగానూ భారత్‌ నుంచి కొంత మంది ఆటగాళ్ల పేర్లు ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ (భారత్), వాషింగ్టన్ సుందర్ (భారత్), టీ నటరాజన్ (భారత్), రిషబ్ పంత్ (భారత్), రవిచంద్రన్ అశ్విన్ (భారత్) వంటి ఆటగాళ్లు ఈ అవార్డు కోసం పోటీ పడనున్నారు.మరోవైపు నాలుగు టెస్టు మ్యాచ్‌ల  సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు చెన్నై చేరుకుంది. కరోనా నేపథ్యంలో నేటి నుంచి 6 రోజులపాటు క్రికెటర్లు క్వారంటైన్‌లో ఉండనున్నారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ తొలిటెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు