Home క్రీడలు కోహ్లీ@1..రోహిత్‌@2

కోహ్లీ@1..రోహిత్‌@2

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ 837 పాయింట్లతో కొనసాగుతున్నాడు.గతనెలలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లో కోహ్లీ 89, 63 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని ఖాతాలో 870 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. కాగా,గాయం కారణంగా రోహిత్‌ ఆ సిరీస్ లో ఆడకపోయినా రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న బాబర్‌ ఆజామ్‌ కన్నా ఐదు పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్ టేలర్‌ 818 పాయింట్లు, ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ 791 పాయింట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక బౌలింగ్‌ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 722 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. అప్గణిస్తాన్ క్రికెటర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ రెండో స్థానంలో ఉన్నాడు.కాగా,టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లా బౌలర్‌ మెహదీ హసన్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.ఇక ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ స్టార్‌ క్రికెటర్ షకీబ్‌ ఆల్‌ హసన్‌ అగ్రస్థానంలో ఉండగా.. మహ్మద్‌ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి రవీంద్ర జడేజా 8వ స్థానం దక్కించుకున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు