Home క్రీడలు ఐసీసీ ర్యాంకింగ్స్‌: దుమ్మురేపిన పుజారా,రహానె!

ఐసీసీ ర్యాంకింగ్స్‌: దుమ్మురేపిన పుజారా,రహానె!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ₹ టెస్ట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్సమెన్ నయవాల్ ఛతేశ్వర్‌ పుజారా ఆరోస్థానానికి ఎగబాకాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకుకు పడిపోయాడు. ఇక టీమిండియా టెస్టు జట్టు వైస్‌కెప్టెన్‌ రహానె ఒక స్థానం మెరుగుపరచుకొని ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. కాగా ఇతివల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా, రహానె అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. 

కాగా,న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ తొలిస్థానంలో కొనసాగుతుండగా..భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌, బుమ్రా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. అలాగే ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా మూడు, అశ్విన్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు