టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలో ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు పేర్కొన్నారు.గుండె కవాటాల్లో పూడిక ఉండడంతో ఆయనకు గురువారం రెండోసారి యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు వేశారు.
కాగా, గంగూలీ ఈ నెల మొదట్లో ఛాతీలో సమస్యతో బాధపడుతూ.. కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు తొలుత ఒక కవాటానికి యాంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్ అమర్చారు. అనంతరం పరిస్థితి కాస్త మెరుగుపడటంతో మిగిలిన రెండు చోట్ల స్టెంట్ వేయటాన్ని వాయిదా వేసారు.కాగా, బుధవారం మరోసారి గుండె సమస్య తలెత్తడంతో ఆస్పత్రిలో చేరగా.. గురువారం ఆయనకు మరో రెండు స్టెంట్లను వేశారు.
కాగా,ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ దేవి శెట్టి, డాక్టర్ అశ్విన్ మెహతాలతో కూడిన వైద్య బృందం దాదాకు చికిత్స చేశారు.అనంతరం వైద్యులు మాట్లాడుతూ..”ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే మరోసారి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు.