Home క్రీడలు ఐపీఎల్ 2021 షెడ్యూల్: తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?

ఐపీఎల్ 2021 షెడ్యూల్: తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది టోర్నీకి ప్రేక్షకులను కూడా అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీ భారత్‌లోనే నిర్వహిస్తామని, దానికోసం అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నామని బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది టోర్నీ కోసం ఇతర దేశాలపై ఆధారపడబోమని, కచ్చితంగా స్వదేశంలోనే టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.కాగా,ఫిబ్రవరి 18న చెన్నైలో ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలం జరగబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన బీసీసీఐ.. వేలం ముగిసిన తర్వాత టోర్నీ పూర్తి  షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించింది. 

అయితే ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య వరుసగా 4 టెస్టుల, 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ జరగనుంది.ఈ సిరీస్ మార్చి 28న ముగియనుండగా.. ఆ తర్వాత 13 రోజుల్లోనే ఐపీఎల్ 2021 సీజన్‌ మ్యాచ్‌లను బీసీసీఐ ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏప్రిల్ 11న అంటే ఆదివారం ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే ఫైనల్ మ్యాచ్‌ని జూన్ 6న అంటే ఆదివారం నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ వేలం ముగిసిన తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం అధికారికంగా ఈ  షెడ్యూల్ ని ప్రకటించనుంది.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు