Home క్రీడలు హర్భజన్‌సింగ్‌ రికార్డుపై కన్నేసిన అశ్విన్‌

హర్భజన్‌సింగ్‌ రికార్డుపై కన్నేసిన అశ్విన్‌

భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ రికార్డుపై రవిచంద్రన్‌ అశ్విన్‌ కన్నేశాడు. ఈ నెల 5 నుంచి చెన్నైలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో హర్బజన్ రికార్డును బద్దలు కొట్టాలని అశ్విన్‌ భావిస్తున్నాడు. ఇప్పటి వరకు 74 టెస్టులాడిన అశ్విన్‌ 377 వికెట్లు పడగొట్టాడు. అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌దేవ్‌ (434), హర్భజన్‌సింగ్‌ (417)ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన నాలుగో టీమిండియా బౌలర్‌ అశ్వినే కావడం విశేషం.అందులో 254 వికెట్లు అతడు స్వదేశంలోనే తీశాడు. 

కాగా,భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుంబ్లే (350), హర్బజన్ సింగ్ (265) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రాబోయే ఇంగ్లాండ్‌ సిరీస్‌లో అశ్విన్‌ మరో 12 వికెట్లు తీస్తే హర్బజన్ సింగ్ ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటాడు. మరో 8 మందిని ఔట్‌ చేస్తే భారత్ లో ఇంగ్లాండ్‌పై 50 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో చేరతాడు. బి.ఎస్‌.చంద్రశేఖర్‌ (64), కుంబ్లే (56), బిషన్‌సింగ్‌ బేడీ (50)లు ఈ జాబితాలో అశ్విన్ కంటే ముందున్నారు.కాగా,భారత్ గడ్డపై 52 రోజులు ఇంగ్లాండ్ టీమ్ పర్యటించనుండగా.. మొత్తంగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలను టీమిండియాతో ఆ జట్టు ఆడనుంది.ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు చెన్నైలో బయోబబుల్‌లో ఉన్నారు. చెపాక్‌ స్టేడియంలో ఫిబ్రవరి 5న తొలి టెస్టు జరగనుంది.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు