భారత్ క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌ను కలిశాడు.అక్షయ్ తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. మీతో ఉన్నంతసేపూ సరదాగా ఉంటుందని దాని కింద రాసుకొచ్చాడు. సరస్సు పక్కన ఇద్దరూ సంతోషంగా నవ్వుతున్న ఫొటోను ధావన్ అభిమానులతో పంచుకున్నాడు.అయితే అంతకుముందు టీమ్ఇండియా యువ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ దంపతులు ధావన్‌ను కలిశారు. ఆ ఫొటోను చాహల్అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ధావన్ మంచి ఆతిథ్యం ఇచ్చాడని పేర్కొన్నాడు.
కాగా..గతేడాది యూఏఈలో పూర్తి అయిన ఐపీఎల్ 13వ సీజన్లో రెచ్చిపోయిన ఈ శిఖర్ ధావన్.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 17 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేశాడు. అందులో వరుసగా రెండు శతకాలు బాదడమే కాకుండా 4 అర్ధశతకాలు సాధించి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో రెండు అర్ధశతకాలతో ఫర్వాలేదనిపించాడు. వన్డేల్లో 74, 30, 16 పరుగులు చేసిన అతడు టీ20ల్లో 1, 52, 28 పరుగులు సాధించాడు.మరోవైపు ఐపీఎల్ 2020 లో చాహల్ 15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో రాణించాడు.