Home క్రీడలు సచిన్,గావస్కర్‌ రికార్డు బద్దలవుతుందా?: ...

సచిన్,గావస్కర్‌ రికార్డు బద్దలవుతుందా?: కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డు

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలవడానికి 489 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఆ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్‌ పేరిట ఉంది. గావస్కర్‌ 22 టెస్టుల్లో 1331 పరుగులు చేశాడు. కాగా, కోహ్లీ 9 టెస్టుల్లో 843 పరుగులు సాధించాడు.అయితే స్వదేశంలో ఇంగ్లాండ్‌పై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ముందు స్థానాల్లో గావస్కర్, గుండప్ప విశ్వనాథ్‌ (1022 పరుగులు, 17 టెస్టులు), సచిన్ తెందుల్కర్‌ (960 పరుగులు, 15 మ్యాచ్‌లు), విజయ్‌ మంజ్రేకర్ (843 పరుగులు, 10 మ్యాచ్‌లు) ఉన్నారు. 

మరోవైపు కెప్టెన్‌గా టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన వాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 14 ప‌రుగుల దూరంలో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ కోహ్లి టెస్టుల్లో సారథిగా 5220 ప‌రుగులు చేశాడు.ఈ సిరీస్ లో కనుక మ‌రో 14 ప‌రుగులు చేస్తే.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్లైవ్ లాయిడ్ రికార్డును కోహ్లి అధిగ‌మిస్తాడు. ఇక కోహ్లీ, లాయిడ్ కంటే ముందు 8659 పరుగులతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్,6623 పరుగులతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అల‌న్ బోర్డ‌ర్,6542 పరుగులతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నారు.

కాగా,ఆస్ట్రేలియా పర్యటనలో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో.. తొలి టెస్టు తర్వాత పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ భారత్‌కి వచ్చేయగా.. మిగిలిన మూడు టెస్టులకీ రహానె కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మూడు టెస్టుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. సిరీస్‌ని 2-1తో గెలిచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లో కోహ్లీ మళ్లీ కెప్టెన్‌గా టీమిండియాని నడిపించబోతున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు