అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ఆటతీరు కనబర్చిన ఆటగాళ్లకు ఇక నుంచి ప్రతినెలా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును ఇవ్వాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులకు నామినీలను ఐసీసీ ప్రకటించింది..జనవరిలో నెలలో కొందరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
ఈ జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ పేరు కూడా ఉంది. అతడితో పాటు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ కూడా ఉన్నారు. వీరిలో జో రూట్ ఈ ఒక్క నెలలోనే టెస్టుల్లో 426 పరుగులు సాధించాడు. పంత్ 245 పరుగులు సాధించాడు. స్టిర్లింగ్ ఈ నెలలో జరిగిన వన్డేల్లో 420 పరుగులు సాధిచడతో ఈ జాబితాలోకి ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఇక పురుషులతో పాటు మహిళా ప్లేయర్ల నామినీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటిచింది. అందులో పాకిస్తాన్ బౌలర్ డియానా బైగ్, సౌతాఫ్రికాకు చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజన్నే కాప్లను నామినేట్ చేసింది. వీరిలో బైగ్ వన్డేల్లో 13.22 ఎకానమీతో 9 వికెట్లు తీయగా.. ఇస్మాయిల్ 4.57 ఎకానమీతో టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టింది. ఇక మరిజన్నే కాప్ వన్డేల్లో 115 బంతుల్లో 115 పరుగులు చేసింది.