Home క్రీడలు టీ10లీగ్‌లో క్రిస్‌గేల్‌ విధ్వంసం..22 బంతుల్లో 84 పరుగులు

టీ10లీగ్‌లో క్రిస్‌గేల్‌ విధ్వంసం..22 బంతుల్లో 84 పరుగులు

వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్‌ మరోసారి దుమ్మురేపాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో టీమ్‌ అబుదాబి తరఫున ఆడుతున్న గేల్షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో బుధవారం మరాఠా అరేబియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.గేల్ ఏకంగా 9 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి.దీంతో మరాఠా అరేబియర్స్ నిర్దేశించిన 98 పరుగుల టార్గెట్ ను అబుదాబి 5.3 ఓవర్లలోనే ఛేదించింది.

కాగా..కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. టీ10 చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మహమ్మద్ షహజాద్ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్లో షెహజాద్ రాజ్‌పుత్స్ తరఫున 12 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియర్స్.. 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. గేల్ విజృంభనతో అబుదాబీ జట్టు 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. గేల్ చేసిన 84 పరుగుల్లో 78 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం విశేషం.కాగా..యామిన్ అహ్మద్‌జాయ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన గేల్ 18 పరుగులు పిండుకున్నాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ తొలి రెండు బంతులను బౌండరీలుగా బాదాడు. అదే ఓవర్లో గేల్ వరుసగా మూడు సిక్సులు బాదడంతో.. 27 పరుగులొచ్చాయి. తర్వాతి ఓవర్లో గేల్ రెండు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు