నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టులకి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మొదలెట్టారు.కాగా.. తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్ జాక్ క్రాలే చెన్నైలో జరిగే తొలి రెండు టెస్టులకూ దూరమయ్యాడు.
మంగళవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జాక్ క్రాలీ సిద్ధమవుతూ తన గది నుంచి బయటికి వస్తూ పాలరాతి ఫ్లోర్‌పై జారిపడ్డాడు. దీంతో అతని మణికట్టుకు గాయమవ్వగా… క్రాలీని వెంటనే స్కానింగ్‌కు తరలించారు. అయితే రిపోర్ట్‌లో క్రాలీ మణికట్టుకు గాయమైనట్లు తేలడంతో తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా క్రాలీ ఇంగ్లండ్ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు.అందులో ఒక సెంచరీ, మూడు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లో క్రాలీ అంతగా రాణించలేదు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు.కాగా..కాగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.