Home క్రీడలు ఐపీఎల్-2021: వేలంలో మొత్తం 1097 మంది క్రికెటర్లు

ఐపీఎల్-2021: వేలంలో మొత్తం 1097 మంది క్రికెటర్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021వ సీజన్‌ కోసం  మినీ ఆటగాళ్ల వేలం  ఫిబ్రవరి 18న చెన్నైలో జరుగుతుందని ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 14 సీజన్ మ్యాచ్‌లు జరిగే వేదిక, తేదీలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది సీజన్‌ ఏప్రిల్‌-మే నెలల్లో జరగనుందని తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2020 సీజన్ పూర్తిగా యూఏఈలోనే జరిగిన విషయం తెలిసిందే.  

కాగా..ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1097 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వెస్టిండీస్ నుంచి అత్యధికంగా 56 ఎంట్రీలు రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఉన్నాయి. రిజిస్ట్రేషన్ గడువు ఫిబ్రవరి 4తో ముగిసింది. 21 మంది భారత ఆటగాళ్లతో పాటు 207 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు వేలం జాబితాలో ఉన్నారు. ఇందులో 27 మంది ఆటగాళ్లు ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా 863 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు. వీరిలో 743 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా..68 మంది విదేశీయులు ఉన్నారు.అయితే కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ఆటగాళ్లు 50 మంది ఉండగా, అన్‌క్యాప్‌డ్ విదేశీ ఆటగాళ్లలో ఇద్దరు ఉన్నారు.

ఇక ఈ మినీ వేలంలో పాల్గొనే 8 ఫ్రాంచైజీలలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 53.20 కోట్లతో వేలానికి దిగనుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 12.9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ. 10.75 కోట్లు ఉన్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు