Home క్రీడలు 57 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 140/2

57 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 140/2

టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 57 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజులో సిబ్లీ(53), జోరూట్‌(45) ఉన్నారు. తొలి సెషన్‌లో భోజన విరామ సమయానికి ముందు ఇంగ్లాండ్‌ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్‌ 63 పరుగుల వద్ద ఓపెనర్‌ రోరీబర్న్స్‌(33) అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటవ్వగా, అదే స్కోర్‌ వద్ద వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ లారెన్స్‌(0) బుమ్రా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆపై జోడీ కట్టిన సిబ్లీ, రూట్‌ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 57 ఓవర్లకు 140/2 స్కోర్‌ సాధించారు.

కాగా..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు బర్న్స్‌, సిబ్లీ శుభారంభం చేశారు.వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, నిలకడగా ఆడుతున్న ఈ జోడీని అశ్విన్‌ విడదీశాడు. 24వ ఓవర్‌లో బర్న్స్‌.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతికి చిక్కడంతో ఇంగ్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆపై బుమ్రా వేసిన 26వ ఓవర్‌లో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ లారెన్స్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు