Home క్రీడలు చెన్నై టెస్టు: 400 దాటిన ఇంగ్లాండ్‌ స్కోరు

చెన్నై టెస్టు: 400 దాటిన ఇంగ్లాండ్‌ స్కోరు

చెన్నై వేదికగా భారత్,ఇంగ్లాండ్  జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 400 స్కోర్‌ చేరుకుంది. నదీమ్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌ (82 పరుగులు) చేసి ఔటయ్యాక.. జోరూట్‌ (183 పరుగుల) పోప్‌(11 పరుగులు) చేసి నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో సెషన్‌లో  విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 137.2 ఓవర్లకు 415/4 స్కోర్‌తో నిలిచింది. అంతకుముందు జో రూట్‌తో కలిసి స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, నదీమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ లైన్‌ సమీపంలో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

కాగా..శుక్రవారం చివరి రెండు సెషన్లలో తేలిపోయిన టీమిండియా బౌలర్లు.. ఈరోజు తొలి సెషన్‌లోనూ నిరాశపరిచారు. మరీ ముఖ్యంగా.. బెన్‌స్టోక్స్‌పై మెరుగైన రికార్డ్ ఉన్న అశ్విన్.. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆరంభంలోనే ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా అశ్విన్ విసిరిన ఓ బంతిని లాంగాఫ్ దిశగా సిక్స్ బాదిన బెన్‌స్టోక్స్.. నదీమ్ బౌలింగ్‌లోనూ మిడ్‌ వికెట్ దిశగా భారీ సిక్స్ బాదాడు. ఇక సుందర్ బౌలింగ్‌లోనూ బెన్‌స్టోక్స్ స్వీప్ షాట్‌‌లతో అదరగొట్టేశాడు. ఈరోజు తొలి సెషన్‌లో మొత్తం 178 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్- రూట్ జోడీ.. 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు