Home క్రీడలు బీబీఎల్‌-2021: టైటిల్‌ విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్స్‌

బీబీఎల్‌-2021: టైటిల్‌ విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్స్‌

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)-2021 సీజన్‌లో  డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌  మరోసారి విజయ దుందుభి మోగించింది. అద్భుత ఆటతీరుతో వరుసగా రెండోసారి బీబీఎల్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. శనివారం సిడ్నీ వేదికగా పెర్త్‌ స్కార్చర్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా..మొత్తంగా ఆ జట్టుకు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ జట్టులో జేమ్స్​ విన్స్​(95 పరుగులు) అద్భుత బ్యాటింగ్ తో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన పెర్త్​ స్కార్చర్స్​ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసి 27 పరుగులతో ఓటమి చవిచూసింది. కాగా..సిడ్నీ సిక్సర్స్​ బౌలర్లలో బెన్‌డార్సిస్‌ మూడు వికెట్లు తీయగా.. సీన్‌ అబాట్‌, డానియెల్‌ క్రిస్టియన్‌, జాక్సన్‌ బర్డ్‌ తలా రెండు వికెట్లు తీశారు. కాగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జేమ్స్‌ విన్స్‌ నిలవగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును జోష్ ఫిలిప్ దక్కించుకున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై మెగా...

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

ఇటీవలి వ్యాఖ్యలు