Home క్రీడలు రూట్‌ అజేయ ద్విశతకం 214*..భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లాండ్‌!

రూట్‌ అజేయ ద్విశతకం 214*..భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లాండ్‌!

చెన్నై వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు మొత్తంగా 353 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 214 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా 263 పరుగులతో తొలి రోజు ఆట ముగించిన ఇంగ్లండ్‌, రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరుస్తోంది. సెంచరీ వీరుడు రూట్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ మెరుపులు కూడా తోడవడంతో  ఇంగ్లాండ్‌ జట్టు151 ఓవర్లకు 469/4 స్కోర్‌తో నిలిచింది. అంతకుముందు బెన్‌స్టోక్స్‌(82) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రూట్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.కాగా..భారీ స్కోర్ దిశగా  ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సాగుతోంది.

కాగా..జనవరిలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 228,186 పరుగులు చేసిన జో రూట్.. టీమిండియా బౌలర్లని చెన్నైలో అలవోకగా ఎదుర్కొంటున్నాడు. చెపాక్ పిచ్ స్పిన్నర్లకి ఆశించిన మేర సహకరించకపోవడంతో.. స్వేచ్ఛగా క్రీజు వెలుపలికి వచ్చి మరీ జో రూట్ షాట్లు ఆడేస్తున్నాడు. అంతేకాకుండా.. స్వీప్, రివర్స్ స్వీప్‌తో పాటు కట్ షాట్‌లతోనూ బౌండరీలు బాదుతున్న జో రూట్.. టీమిండియా బౌలర్లకి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. రూట్ ఈరోజు మొత్తం క్రీజులో నిలిస్తే.. ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు