భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో కడపటి వార్తలందేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. పుజారా 24 పరుగులతో కోహ్లీ 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ధాటిగా ఆడిన గిల్ 28 బంతుల్లో 29 పరుగులు చేసి ఆర్చర్ చేతికి చిక్కాడు. రోహిత్ శర్మ పరుగులు చేసి మరోసారి నిరాశ పరిచాడు. ఈ రెండు వికెట్లు ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ ఖాతాలోకి వెళ్లాయి.
అంతకు ముందు మూడవ రోజు తొలి గంటలోనే ఇంగ్లాండ్ 578 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా, నదీమ్ అండ్ ఇశాంత్ రెండేసి వికెట్లు తీశారు.
మొదటి టెస్ట్ కు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.