1999 లో ఇదే 7th ఫిబ్రవరి న, అనిల్ కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానం లో జరిగిన భారత పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో, ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి అనిల్ బాయ్ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ మరియు ప్రపంచంలో రెండవ బౌలర్.
ఇంగ్లాండ్ కు చెందిన జిమ్ లేకర్ 1956 లో ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్. 43 సంవత్సరాల జిమ్ లేకర్ రికార్డు ను అనిల్ కుంబ్లే సమం చేశాడు 1999 లో. అనిల్ బాయ్, ఈ ఘనత సాధించి నేటికి 22 సంవత్సరాలు.
ఈ ఇద్దరు స్పిన్నర్ లు కావడం గమనార్హం. అనిల్ కుంబ్లే లెగ్ స్పిన్నర్ అయితే జిమ్ లేకర్ ఆఫ్ స్పిన్నర్.