భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 91 పరుగులు, పూజారా 73 పరుగులు చేశారు. సుందర్ 33 పరుగులతో అశ్విన్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. పంత్ దూకుడు. పుజారా నిలకడైన ఆట తో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది.
ఇంగ్లాండ్ బౌలర్ల లో బెస్ 4 వికెట్లు, ఆర్చర్ 2 వికెట్లు తీశారు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది.
ఇంగ్లాండ్ బౌలర్ లీచ్ 17 ఓవర్ లు వేసి ధారాళంగా 94 పరుగులు ఇవ్వడమే కాకుండా, రెండు రివ్యూ లను వృధా చేశాడు.