భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ లీచ్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పుజారా 12 పరుగులతోను, గిల్ 15 పరుగులతోను క్రీజీలో ఉన్నారు.
అంతకు ముందు భారత మొదటి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. అశ్విన్ 31 పరుగులు చేశాడు.
ఫాలో ఆన్ ఇవ్వకుండా, అనంతరం రెండో ఇన్నింగ్స్ పారంభించిన ఇంగ్లాండ్, వేగంగా అదే ఉద్దేశంలో 178 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. మళ్ళి రూట్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశ్విన్ తన సొంత పిచ్ లో సత్తా చాటి 6 వికెట్లు తీశాడు.
ఆటకు రేపు ఆఖరి రోజు. భారత్ గెలవడానికి కావలసినది 381 పరుగులు. రికార్డు ఛేదనలో విజయం సాధిస్తుందో లేదంటే డ్రా తో సరిపెట్టుకుందో చూడాలి. సగటు భారత అభిమాని గా విజయం సాధించాలని ఆశిద్దాం