భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 227 పరుగుల తేడా తో విజయం సాధించింది. 420 పరుగుల విజయ లక్ష్యం తో బాటింగ్ ప్రారంభించిన భారత్ 192 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. గిల్ 50 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 73 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మాన్ ఘోరంగా విఫలం అయ్యారు. రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు కలవర పెడుతోంది.
రహానే, సుందర్ డక్ అవుట్ అవగా, పంత్ 11 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇండియన్ క్రికెట్ వాల్ గా పిలవబడుతున్న పుజారా సైతం 11 పరుగులకే అవుట్ అయ్యాడు
మొదటి ఇన్నింగ్స్ లో ధారాళంగా పరుగులిచ్చిన లీచ్, నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ సెన్సేషన్ ఆండర్సన్, కీలక సమయంలో త్రీ వికెట్లు వెంట వెంటనే కూల్చాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ మాన్ అఫ్ ది మ్యాచ్. గబ్బా విజయాన్ని మరచిపోకముందే, సొంత గడ్డపై ఓడిపోవటం బాధాకరం.
భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 13న చెన్నై లోనే ప్రారంభమవుతుంది.