Home క్రీడలు భారత్‌తో టీ20లకు ఇంగ్లాండ్‌ జట్టు ప్రకటన

భారత్‌తో టీ20లకు ఇంగ్లాండ్‌ జట్టు ప్రకటన

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ 16 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా మార్చి 12 నుంచి భారత్‌, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.మార్చి 12, 14, 16, 18, 20 తేదీల్లో సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇయాన్‌ మోర్గాన్‌ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా,మోర్గాన్‌తో పాటు ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, సీనియర్‌ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌తో ఆ జట్టు పటిష్టంగా ఉంది. కాగా, బిగ్ బాష్‌లో పెర్త్ స్క్రాచర్స్ తరఫున బరిలోకి దిగి.. 14 ఇన్నింగ్స్‌ల్లో 426 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లాండ్ టీ20 జట్టులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, బిగ్ బాష్ లీగ్‌లో 161.60 స్ట్రైక్ రేట్‌తో 543 పరుగులు చేసిన ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కు టీ20 జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. 

ఇంగ్లాండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు