విజృంభించిన రోహిత్ శర్మ. పటిష్ట స్థితిలో భారత్
భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు చెన్నై లో ప్రారంభమైన రెండవ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మొదటి రోజు ఆటలో రోహిత్ శర్మ ఆట హైలైట్. ఈ మ్యాచ్ కు ప్రేక్షకులను స్టేడియంలో కి అనుమతించారు. ప్రేక్షకుల చప్పట్లు, కేరింతలు ఇచ్చిన ఉత్సాహంతో ఏమో రోహిత్ శర్మ మునుపటి ఫామ్ అంది పుచుకున్నాడు. 17 బౌండరీలు, 2 సిక్సర్ల తో 161పరుగులు చేసి లీచ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రహానే నుంచి చక్కని సహకారం లభించింది. 67 పరుగులు చేసిన రహానె మొయిన్ అలీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. పంత్ వేగంగా ఆడుతూ 33 పరుగులతో అజేయం గా అక్షర్ పటేల్ తో పాటు క్రీజ్ లో ఉన్నాడు.
రోహిత్ శర్మ పుజారా తో కలసి రెండవ వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, రహానే తో కలసి నాలుగవ వికెట్ కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే రహానే కూడా అవుట్ అయ్యాడు. కాగా గిల్, కెప్టెన్ కోహ్లీ డక్ అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ల లో స్పిన్నర్ లు లీచ్, అలీ రెండేసి వికెట్లు తీయగా పేసర్ స్టోన్,కెప్టెన్ రూట్ తలా ఒక వికెట్ తీశారు.