Home క్రీడలు ఐపీఎల్-2021 వేలం: పంజాబ్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!

ఐపీఎల్-2021 వేలం: పంజాబ్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!

ఐపీఎల్-2021‌ వేలం ఈ నెల 18న జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఊహించని షాకిచ్చింది. టోర్నీలోని ప్రతి జట్టు ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం కేటాయించిన దాంట్లో  75 శాతం ఖర్చు చేయాలని.. అలా చేయకుంటే ఆ డబ్బులు బీసీసీఐ ఖాతాలోకి జమకానున్నాయి. ఈసారి ఐపీఎల్‌ వేలంలో పాల్గొననున్న ఫ్రాంచైజీల్లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్‌ జట్టు 16 మందిని రిటైన్‌ చేసుకొని మిగిలిన వారిని రిలీజ్‌ చేసింది. వీరిలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సహా షెల్డన్‌ కాట్రెల్‌, కె. గౌతమ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, జిమ్మి నీషమ్‌, హార్డస్‌ విల్‌జెన్‌లోపాటు కరుణ్‌ నాయర్‌, సుచిత్‌, తేజిందర్‌ సింగ్‌ దిల్లాన్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

అయితే, బీసీసీఐ ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం రిటైన్‌ చేసుకున్న 16 మంది ఆటగాళ్లకు పంజాబ్‌ రూ. 31.8 కోట్లు చెల్లించగా.. ఇప్పుడు వారి వద్ద 53.2 కోట్లు ఉన్నాయి. ఆటగాళ్ల వేలానికి మిగిలి ఉన్న మొత్తంలో 75 శాతం ఖర్చు చేయాలని బీసీసీఐ తెలిపిన నేపథ్యంలో 53.2 కోట్లలో 75 శాతం అంటే 31.7 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బుతోనే ఆటగాళ్లను వేలంలో పొందే అవకాశం కింగ్స్‌ పంజాబ్‌కు ఉండనుంది. ఈ తరుణంలో పంజాబ్‌ దగ్గరుండే దాదాపు రూ. 21.5 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి వెళ్లనున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు