టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డులు చేరాయి. రెండో టెస్టులో భాగంగా కోహ్లీ ఇంగ్లండ్ స్పిన్నర్ మెయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి డకౌట్‌గా పెవిలియన్ సంగతి తెలిసిందే. అలీ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌కు అవతల పడుతూ వెళ్లడంతో కోహ్లి కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్ స్టంఫ్ వికెట్‌ను గిరాటేసింది.దీంతో తన టెస్టు కెరీర్లో కోహ్లి 11వ సారి డకౌట్‌గా వెనుదిరగ్గా.. ఒక స్పిన్నర్ బౌలింగ్‌లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. అంతకముందు 10 సార్లు కోహ్లీ ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే డకౌట్‌గా వెనుదిరగాడు. కాగా.. అలీ ఒక్కడే కోహ్లిని డకౌట్ చేసిన ఏకైక స్పిన్నర్‌గా అరుదైన గుర్తింపు సాధించాడు.
మరోవైపు టీమిండియా కెప్టెన్లలో వరుస ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు బౌల్డయిన రికార్డును కూడా కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకు ముందు టీమిండియా కెప్టెన్లు ఎవరూ కూడా ఇలా రెండు వరుస ఇన్నింగ్స్‌ల్లో బౌల్డ్ కాలేదు. ఇటీవల ఇగ్లండ్తోనే జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ 72 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ బౌల్డయ్యాడు. ఆ తరువాత ఇప్పుడు మళ్లీ మొయీన్ అలీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
ఇదిలావుండగా..రెండో టెస్టులో టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రహానె అర్ధసెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్న రహానె 104 బంతుల్లో 8ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేశాడు. టెస్టు కెరీర్లో రహానెకు ఇది 23వ ఆఫ్ సెంచరీ కావడం విశేషం. సెంచరీతో చెలరేగిన రోహిత్‌తో కలిసి రహానె 120కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 86/3తో ఇబ్బందుల్లో ఉన్న జట్టును ఈ జోడీ ఆదుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లు ఆడిన భారత్ 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. రోహిత్(148), రహానె(56) క్రీజులో ఉన్నారు