భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ గిల్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టోన్ బౌలింగ్ లో ఖాతా తెరవకుండానే LBW గా ఔట్ అయ్యాడు. అనంతరం పుజారా కొంతవరకు నిలిచినా 21 పరుగులకు స్పిన్నర్ లీచ్ చేతికి చిక్కాడు. కెప్టెన్ కోహ్లీ మొయిన్ అలీ వలలో పడి డక్ ఔట్ అయ్యాడు. వికెట్లు పడుతున్నా రోహిత్ శర్మ ధాటి గా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు.
కడపటి వార్తలందే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 149 బంతుల్లో 112 పరుగుల (14 ఫోర్లు |2 సిక్సర్లు) తోను, రహానే 31 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు