Home క్రీడలు అర్ధశతకంతో అదరగొట్టిన పంత్.. భారత్‌ 329 ఆలౌట్‌

అర్ధశతకంతో అదరగొట్టిన పంత్.. భారత్‌ 329 ఆలౌట్‌

చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 329 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 300/6తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ జట్టు మరో 29 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు నష్టపోయింది. టీమిండియా యువ సంచలనం రిషభ్‌పంత్‌ (58 ) పరుగులు చేసి ఆఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రెండోరోజు తొలి ఓవర్‌లోనే మోయిన్‌ అలీ.. అక్షర్‌ పటేల్‌(5), ఇషాంత్‌(0)ను ఔట్‌ చేసి టీమిండియా కు ఆదిలోనే కోలుకోలేని షాకిచ్చాడు. అయితే, కుల్‌దీప్‌(0)తో నిలకడగా ఆడిన రిషబ్ పంత్‌ బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 65 బంతుల్లో ఆఫ్ సెంచరీ సాధించాడు. అయితే, స్టోన్‌ వేసిన 96వ ఓవర్‌లో కుల్‌దీప్‌, సిరాజ్‌(4) ఔటవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

కాగా, అంతకుముందు తొలిరోజు టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకోగా, రోహిత్‌(161) పరుగులు, రహానె(67) పరుగులు చేసి రాణించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లాండ్‌ బౌలర్లలో మోయిన్‌ అలీ 4, స్టోన్‌ 3, లీచ్‌ 2, రూట్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక మరోవైపు రెండో టెస్టులో థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి రెండు సార్లు వివాదాస్పద నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ టీమ్ తొలుత అజింక్య రహానె క్యాచ్ ఔట్ కోసం డీఆర్‌ఎస్ కోరితే.. అనిల్ చౌదరి ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసమని పొరబడి రిప్లైని ఆ కోణంలో పరిశీలించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ స్టంపౌట్ విషయంలోనూ అనిల్ చౌదరి వివాదాస్పదంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మొత్తంగా.. ఇంగ్లాండ్ టీమ్.. మైదానంలోనే థర్డ్ అంపైర్ నిర్ణయాలతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనిపించింది.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు