Home క్రీడలు అశ్విన్ సెంచరీతో దద్దరిల్లిన చెపాక్ స్టేడియం!

అశ్విన్ సెంచరీతో దద్దరిల్లిన చెపాక్ స్టేడియం!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే భారత్ బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు‌ వరుసగా క్యూ కట్టారు. 55 పరుగుల వద్ద పుజారా (7) రనౌట్ కాగా, అదే పరుగుల వద్దే రోహిత్ శర్మ‌ (26) కూడా ఔట్‌ అయ్యాడు. 65 పరుగుల వద్ద రిషభ్‌ పంత్‌ (8) వెనుదిరిగాడు. 86 పరుగుల వద్ద రహానే‌ (10) పెవిలియన్‌ చేరాడు. ఈక్రమంలో క్రీజులోకొచ్చిన కెప్టెన్‌ కోహ్లి (62) ఆచితూచి ఆడాడు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక అక్షర్ (7) ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ కోహ్లితో కలిసి ఏడో వికెట్‌కు కీలకమైన 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చి ఇంగ్లండ్‌ వెన్నువిరిచిన రవిచంద్రన్‌ అశ్విన్ (148 బంతుల్లో 106; 14ఫోర్లు, 1సిక్స్)‌ ‌బ్యాటింగ్‌లోనూ రాణించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట అశ్విన్ శతకంతో చెలరేగిపోయాడు. మొయిన్‌ అలీ వేసిన  82వ ఓవర్లో  ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాది 17 పరుగులు రాబట్టి సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. కాగా, సొంతమైదానంలో సెంచరీ చేయడంతో అశ్విన్‌ తనదైన స్టైల్‌లో సంబరాలు జరుపుకున్నాడు. టెస్టు కెరీర్‌లో అశ్విన్‌కిది ఐదో శతకం కావడం విశేషం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 286 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత్‌ 481 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు