Home క్రీడలు 'అక్షర్‌ తిప్పేశాడు.. అశ్విన్ దంచేశాడు'

‘అక్షర్‌ తిప్పేశాడు.. అశ్విన్ దంచేశాడు’

రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం

చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 317 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ జట్టు 54.2 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా నిర్దేశించిన 482 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఓవర్ నైట్ స్కోర్ 53/3తో ఇన్నింగ్స్‎ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. క్రీజులోకి వచ్చిన లారెన్స్, రూట్ నిలకడగా ఆడుతున్న క్రమంలో..అశ్విన్ వేసిన బౌలింగ్‎లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లారెన్స్(26)ను పంత్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 66 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాలోపడింది. క్రీజులోకి వచ్చిన స్టోక్స్ కూడా (8) పరుగులకే అశ్విన్ బౌలింగ్‎లో వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన ఓలీపోప్ (12) అక్షర్ పటేల్ బౌలింగ్‎లో ఔట్ కావడంతో ఇంగ్లండ్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. అప్పటికే ఇంగ్లండ్ 110 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.

ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‎మెన్ బెన్ ఫోక్స్ కూడా (2) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఔట్ అయి పెవిలియన్ బాటపట్టాడు. కుల్దీప్ యాదవ్‎కు ఈ మ్యాచ్‎లో తొలి వికెట్ లభించింది. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్లను కోల్పోయి 116 లు చేసింది. కుల్దీప్ యాదవ్‎కు ఈ మ్యాచ్‎లో ఇదే తొలి వికెట్. ఆ తర్వాత వచ్చిన రూట్ (33) అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో చివ‌ర్లో మెరుపులు మెరిపించిన మోయిన్ అలీ 43 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన.. అక్షర్‌ 5/60, అశ్విన్‌ 3/53 మరోసారి చెలరేగారు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయ‌డంతో పాటు సెంచ‌రీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.  ప‌రుగుల ప‌రంగా టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో టీమిండియాకు ఇది ఐదో భారీ విజ‌యం కావ‌డం విశేషం

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు