చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. తొలి టెస్టులో విజయం తర్వాత అనూహ్యంగా పాయింట్ల పట్టికలో పైకి దూసుకెళ్లిన ఇంగ్లండ్ జట్టు తాజా ఓటమితో నాలుగో స్థానానికి దిగజారింది. టీమిండియా మాత్రం ఇంగ్లీష్ జట్టుపై సాదించిన విజయంతో నాలుగు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. కాగా, జూన్‌లో లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఫైనల్‌కు ఎవరు అర్హత సాధిస్తారనేది మాత్రం మూడో టెస్టు తర్వాతే తేలనుంది.
అయితే, అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే 2-1 తేడాతో లేకుండా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా ఇంగ్లండ్ జట్టు విజయం సాధిస్తే మాత్రం నాలుగో టెస్టులోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా భారత్, ఇంగ్లాండ్ సిరీస్ డ్రా అయితే ఈ రెండు జట్లు కాకుండా ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళ్తుంది. ఈ ఈక్వేషన్లతో ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు చాలా ఆసక్తికరంగా మారింది. కాగా, టీమిండియాకు ప్రస్తుతం 69.7 పీసీటీ పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్‌కు 67 పీసీటీ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే 70 పీసీటీ పాయింట్లతో న్యూజిలాండ్ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.