అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు 17 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్టు ఆడిన షాబాజ్ నదీమ్‌ను విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు జాతీయ జట్టు నుంచి బోర్డు విడుదల చేసింది. ఇక గాయం నుంచి కోలుకున్న పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా అహ్మదాబాద్‌లో జట్టుతో చేరతాడని చెప్పింది. మరో పేసర్ మహ్మద్ షమిని జట్టులోకి తీసుకోలేదు. గాయం నుంచి అతడు కోలుకున్నప్పటికీ టెస్టులకు పూర్తిఫిట్‌నెస్ సాధించకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 24 నుంచి మొతెరా(అహ్మదాబాద్) వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఇక మార్చిలో ఇంగ్లాండ్‌తో భారత్ అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
టీమిండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్