Home క్రీడలు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌: దుమ్మురేపిన రోహిత్.. దూసుకెళ్లిన అశ్విన్‌

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌: దుమ్మురేపిన రోహిత్.. దూసుకెళ్లిన అశ్విన్‌

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తాచాటారు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు గెలవడంలో  కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌ తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. ఈ మ్యాచ్ లో అద్భుత సెంచరీతో పాటు ఎనిమిది వికెట్లతో అదరగొట్టిన అశ్విన్ ఆల్‌రౌండర్‌ జాబితాలో అయిదో స్థానానికి ఎగబాకాడు. వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్, భారత్ ఆటగాడు రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అశ్విన్‌, బుమ్రా వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా స్పీడ్ గన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇక చెన్నై తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో విరుచుకుపడ్డ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ విభాగంలో టాప్-15లో నిలిచాడు. తొమ్మిది స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్‌లో  ఆఫ్ సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అయిదో ర్యాంక్‌లో ఉన్నాడు. ఛటేశ్వర పుజారా ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు. ఇక టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ పదకొండో ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ నాలుగో ర్యాంక్‌కు పడిపోగా..న్యూజిలాండ్ కెప్టెన్  కేన్‌ విలియమ్సన్‌ (919 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు