ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) మినీ వేలం గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 164 మంది భారత్ ఆటగాళ్లు కాగా.. 125 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా… మరో ముగ్గురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. అయితే వీరందరి నుంచి 61 మంది ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీలోని 8 ఫ్రాంచైజీలలో ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు ఉంది.. ఏ జట్టు ఎంత మంది ఆత్తగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం….
★ ముంబై ఇండియన్స్
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 7
◆ ఎంత డబ్బు ఉంది: రూ.15.35 కోట్లు
★ రాజస్థాన్ రాయల్స్
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9
◆ ఎంత డబ్బు ఉంది: రూ.15.35 కోట్లు
★ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 14
◆ ఎంత డబ్బు ఉంది: రూ.35.4 కోట్లు
★ సన్రైజర్స్ హైదరాబాద్
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 3
◆ ఎంత డబ్బు ఉంది: రూ.10.75 కోట్లు
★ చెన్నై సూపర్ కింగ్స్
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 6
◆ ఎంత డబ్బు ఉంది: రూ.19.9 కోట్లు
★ ఢిల్లీ క్యాపిటల్స్
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8
◆ ఎంత డబ్బు ఉంది: రూ.13.04 కోట్లు
★ పంజాబ్ కింగ్స్
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9
◆ ఎంత డబ్బు ఉంది: రూ.53.2 కోట్లు
★ కోల్కతా నైట్రైడర్స్
◆ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8
◆ ఎంత డబ్బు ఉంది: రూ.10.75 కోట్లు